Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్య సినిమాలో విలన్ గా యువ హీరో

సూర్య సినిమాలో విలన్ గా యువ హీరో

వార్త 1 day ago

Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, 'ఆవేశం' ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సీన్' (Scene). ఈ సినిమాలో యువ కథానాయకుడు, 'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు నస్లెన్ కె.

గఫూర్ విలన్ పాత్రలో నటిస్తుండటం సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో ఆయన ‘ఈశ్వరన్’ అనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ (సైకో కిల్లర్) పాత్రను పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఈశ్వరన్ క్యారెక్టర్ ఇంట్రో ప్రోమో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే నస్లెన్ ఇలాంటి వైవిధ్యమైన నెగిటివ్ రోల్‌ను ఎంచుకోవడం ఆయన నటనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల - బాక్సాఫీస్ వద్ద రచ్చ

సూర్య సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతికల 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ దసరా ముగిసిన వెంటనే ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్రబృందం, దీపావళి పండుగ కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సూర్య, క్రూరమైన సైకో కిల్లర్‌గా నస్లెన్ మధ్య సాగే మైండ్ గేమ్స్, యాక్షన్ ఎపిసోడ్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మలయాళం, తమిళం సహా ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని రూపాందించారు.

ఆ రికార్డు సాధించడం ఒక్క రజినీకే సాధ్యం - అల్లు అర్జున్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha