Suryapet Fine Rice Scam: సూర్యాపేట బ్యూరో : ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న సన్నబియ్యం పంపిణీలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ బడా రేషన్ డీలర్ వద్ద 100 క్వింటాళ్లకు పైగా సన్నబియ్యం లెక్కల్లో తేడాలు రావడంతో సంబంధిత శాఖ,పోలీస్ శాఖా విచారణ చేపట్టినట్లు విశ్వనీయ సమాచారం.
తనిఖీల్లో భాగంగా సివిల్ సప్లై అధికారులు డీలర్ షాప్ రికార్డులను పరిశీలించగా, ఉన్న బియ్యానికి, రికార్డు లలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణలో రెండు రేషన్ షాప్ లలో 100 క్వింటాళ్లకు పైగా సన్నబియ్యం మాయమైనట్లు తేలడంతో అధికారులు పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.దీనిపై వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో జిల్లా కలెక్టర్ ఓ కమిటీ వేసి విచారణ చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం.
Read Also: New Mega Bus Hub Hyderabad:హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
Suryapet district center 100 quintals fine rice illegal transport
Suryapet Fine Rice Scam: పోలీస్ ల అదుపులో బడా రేషన్ డీలర్.?
జిల్లా పోలీస్ లు గుట్టుచప్పుడు కాకుండా గత రెండు రోజులుగా సదరు రేషన్ డీలర్‌ను అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. మాయమైన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించారా లేక మరేవిధంగా పక్కదారి పట్టించారనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అక్రమాల వెనుక ఇంకెవరి ప్రమేయం ఉంద అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్రంలోనే ఇంత భారీ స్థాయిలో సన్నబియ్యం గోల్‌మాల్ జరగడంపై లబ్ధిదారులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల నోటికాడి బుక్కను దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయం తెలిసిన వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన జిల్లాలోని ఇతర రేషన్ డీలర్లలోనూ కలకలం రేపుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

