Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు

సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు

వార్త 2 weeks ago

Sanchita Ugale: బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి సరిగ్గా ఆరేళ్లు పూర్తయిన రోజే (జూన్ 14వ తేదీన).. ముంబైలో మరో వర్ధమాన టెలివిజన్ నటి సంచిత ఉగాలే (Sanchita Ugale) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోవడం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది.

కేవలం 22 ఏళ్ల వయసున్న సంచిత మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె సోదరుడు ఆకాశ్ సతీష్ ఉగాలే మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు “ఇండస్ట్రీ మాఫియా” మరియు “నెపోటిజం/అణచివేత” కోణాలపై సరికొత్త చర్చకు దారితీశాయి.

Read Also:Sanchita Ugale Suicide Case: సంచితా ఉగలే ఆత్మహత్య వెనుక అసలు రహస్యం? లీకైన వాట్సాప్ చాట్స్!

ఇన్స్‌టాగ్రామ్ ఐడీ మిస్టరీ - పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా?

సంచిత మరణించిన కొద్దిసేపటికే ఆమె సోదరుడు ఆకాశ్‌కు ఒక షాకింగ్ ఇన్స్‌టాగ్రామ్ లింక్ అందింది. “నా సోదరి మరణించి, పోస్ట్‌మార్టం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో నా స్నేహితుడు ఒక ఇన్స్‌టాగ్రామ్ ఐడీ లింక్ పంపాడు. అది నా సోదరి పేరు, ఫోటోతోనే ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ఆ ఐడీ జూన్ 2వ తేదీనే (మరణానికి 12 రోజుల ముందే) క్రియేట్ అయింది” అని ఆకాశ్ తెలిపారు. ఆ అకౌంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వీడియోలు పెట్టి.. “మళ్లీ జూన్ 14వ తేదీ.. అదే రోజు సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు కదా.. అదే రోజు నా చెల్లెలు కూడా సూసైడ్ చేసుకున్నారు.. వి మిస్ యూ సుశాంత్ సార్” అంటూ రాసి ఉంది. చనిపోకముందే ఈ తరహా పోస్ట్‌లు మరియు ఐడీ క్రియేట్ కావడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కుటుంబం అనుమానిస్తోంది.

“సుశాంత్ లాగే నా చెల్లెల్ని తొక్కేశారు” - ఇండస్ట్రీ మాఫియాపై ఆరోపణలు

 Sanchita Ugale Brother Akash Statement

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే పవర్ గేమ్ మరియు పక్షపాతానికి తన సోదరి బలైపోయిందని ఆకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.”నా చెల్లెలు బతకడానికి భయపడేలా చేశారు. సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆమెను దారుణంగా తొక్కేసి, కెరీర్‌తో ఆటాడుకున్నాయి. నాడు సుశాంత్ సింగ్‌ను ఎలాగైతే మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు కారణమయ్యారో.. నా చెల్లెలి విషయంలోనూ అదే పద్ధతిని వాడారు. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలను ఇండస్ట్రీలోని పెద్దలు అణగదొక్కుతున్నారు. ఈ పవర్ గేమ్ వెనుక ఉన్న మాఫియాపై ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలి.”

ఎదుగుతున్న కెరీర్.. ఇంతలోనే విషాదం

కేవలం 22 ఏళ్ల వయసులోనే సంచిత బుల్లితెరతో పాటు ఓటీటీ, వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెరపై సూపర్ హిట్ అయిన కుంకుమ్ భాగ్య, వాగ్లే కి దునియా, దిల్ వాలీ దుల్హా లే జాయేంగే వంటి సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. విక్రాంత్ మెస్సీ హోస్ట్ చేసిన క్రైమ్ ఆజ్ కల్, మనోజ్ బాజ్‌పేయ్ నటించిన సైలెన్స్ 2: ది నైట్ ఓల్ బార్ షూట్‌అవుట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా, విక్కీ కౌశల్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఛావా’ (Chhaava) లో తారాభాయ్ పాత్రలోనూ మెప్పించింది.

Sanchita Ugale:పోలీస్ కేసు నమోదు

ముంబైలోని నాలాసోపారా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో జూన్ 14 (సోమవారం) రాత్రి 7 గంటల ప్రాంతంలో సంచిత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. ప్రస్తుతం ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దీనిని ప్రాథమికంగా యాక్సిడెంటల్ డెత్ (Accidental Death Report – ADR) గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సోదరుడు రేపిన ‘ఇన్‌స్టాగ్రామ్ మిస్టరీ’ కోణంలో కూడా పోలీసులు విచారణ జరపాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha