Independence Day 2026 : ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో అగ్రనేత సోనియా గాంధీ ప్రవర్తించిన తీరుపై పెద్దెత్తున వివాదం చెలరేగింది.
పార్టీ ఆఫీస్‌లో జాతీయ గీతం ‘వందేమాతరం’ పూర్తి పాఠం అలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు పరస్పరం మాట్లాడుకుంటూ ఆపాటను ఆపాల్సిందిగా నిర్వాహకులకు సైగలు చేశారంటూ సంబంధించిన వీడియో నెటిజన్లు, బిజెపి వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. జాతీయ భావనకు ప్రతీకగా నిలిచే వందేమాతరం పట్ల కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీవ్ర అలసత్వాన్ని, అనాదరణను ప్రదర్శించిందని బిజెపి నాయకులు ఆరోపించారు. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెలిపే ఈ పాటపై సోనియా గాంధీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారో వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ వివరణ - సోషల్ మీడియాలో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తూ బిజెపి ఆరోపణలను ఖండించింది. వందేమాతరం ఆలపించడాన్ని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదని, చాలాసేపటి నుంచి నిలబడి ఉన్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం కూర్చోవడానికి కుర్చీ తీసుకురావాలని మాత్రమే సోనియా గాంధీ నిర్వాహకులను కోరారని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. అయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏదైనాప్పటికీ, జాతీయ గీతం లేదా జాతీయ చిహ్నాలకు గౌరవమిచ్చే క్రమంలో పాట పూర్తయ్యే వరకు వేచి చూసి మాట్లాడాల్సింది అని, ఇలాంటి సందర్భాల్లో నాయకులు మరింత సంయమనం వహించాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

