Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వార్త 1 day ago

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నప్పటికీ, దేశీయంగా మార్కెట్ డిసెలరేషన్ నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తోంది.

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు!

ఇవాళ ఉదయం 09:29 సమయానికి మార్కెట్ స్థితిగతులు ఇలా ఉన్నాయి:

నిఫ్టీ (Nifty): 41 పాయింట్లు లాభపడి 22,731 వద్ద ట్రేడవుతోంది.

సెలెక్స్‌ (Sensex): సుమారు 300 పాయింట్లు ఎగబాకి 73,545 వద్ద కొనసాగుతోంది.

యూఎస్‌ డాలర్ ఇండెక్స్ (USD Index): 101.65 వద్ద ఉంది.

క్రూడ్‌ ఆయిల్: బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 113.6 డాలర్లుగా నమోదైంది.

యూఎస్‌ బాండ్ ఈల్డ్స్: అమెరికా 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 4.96 శాతానికి చేరాయి.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం

గడిచిన ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ (S&P 500) సూచీ 1.21 శాతం తగ్గగా, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నాస్‌డాక్‌ (Nasdaq) ఏకంగా 2.6 శాతం దిగజారింది. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడినప్పటికీ, దేశీయ సూచీలు మాత్రం ఉదయం సెషన్‌లో గ్రీన్‌ జోన్‌లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Epaper: epaper.vaartha.com

పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha