Gold Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పైకి కదిలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, స్థానిక డిమాండ్ కారణంగా ప్రధానంగా 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం విక్రయాల్లో ఈ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి.
gold rate today heavy increaseబంగారం మరియు వెండి ప్రస్తుత ధరల వివరాలు
మేలిమి బంగారం అయిన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 మేర పెరిగి రూ.1,54,580 వద్దకు చేరింది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో స్థానిక పరిస్థితులు, రవాణా ఖర్చులను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో ఉమ్మడిగా 3 శాతం జీఎస్టీ (GST) అదనంగా చెల్లించాల్సి ఉంటుందని బులియన్ వర్తకులు స్పష్టం చేస్తున్నారు.

