Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
T20 WC 2026: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ స్టోయినిస్ అరుదైన రికార్డు

T20 WC 2026: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ స్టోయినిస్ అరుదైన రికార్డు

వార్త 4 months ago

టీ20 ప్రపంచకప్‌ 2026 (T20 WC 2026) లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే సంచలన విజయం నమోదైంది.. పసికూన జింబాబ్వే అద్వితీయమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది.

గ్రూప్-బీలో భాగంగా కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. అయితే, మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున 50 వికెట్లు, 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

Mohammad Amir: అభిషేక్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

జింబాబ్వే నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చేధించలేకపోయింది. 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాట్ రేన్‌షా(44 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65), గ్లేన్ మ్యాక్స్‌వెల్(31) మినహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బాని(4/17) నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.

సూపర్-8 లో జింబాబ్వే

టీ20 ప్రపంచకప్ చరిత్రలో జింబాబ్వే చేతిలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు ఇది రెండోసారి. అరంగేట్ర టీ20 ప్రపంచకప్ 2007 టోర్నీలోనూ ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించింది. తాజా ఓటమితో జింబాబ్వే సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకోగా.. ఆసీస్ సంక్లిష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం గ్రూప్‌-బీలో శ్రీలంక, జింబాబ్వే రెండేసి విజయాలతో టాప్-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడి మూడో స్థానంలో కొనసాగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha