Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
T20 World Cup 2026: ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం

T20 World Cup 2026: ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం

వార్త 4 months ago

టీ20 వరల్డ్ కప్‌ 2026 (T20 World Cup 2026) గ్రూప్ స్టేజ్‌లో సౌతాఫ్రికా - అప్ఘనిస్తాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌ లో ఆఖరి ఓవర్‌లో హై డ్రామా కొనసాగింది.

చివరలో నరాలు తెగే ఉత్కంఠభరిత క్షణాలను ఎక్స్‌పీరియన్స్‌ చేశారు ఫ్యాన్స్‌. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా,

అఫ్ఘానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా అది కూడా డ్రా అయింది. ఇరు జట్లు 17 పరుగులు చేశాయి. రెండో సూపర్‌ ఓవర్ నిర్వహించారు. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేసింది.. రెండో సూపర్‌ ఓవర్‌లో అఫ్ఘాన్‌ 19 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచింది.

T20 WC: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. విమాన టిక్కెట్ ధరలకి రెక్కలు

దక్షిణాఫ్రికా స్కోరు
నిర్ణీత 20 ఓవర్లలో 187/6

మొదటి సూపర్ ఓవర్ - 1 ఓవర్‌లో 17/1
రెండో సూపర్ ఓవర్ - 1 ఓవర్‌లో 23/0

అఫ్ఘానిస్థాన్ స్కోరు
19.4 ఓవర్లు - 187 ఆలౌట్

మొదటి సూపర్ ఓవర్ - 1 ఓవర్‌లో 17/0
రెండో సూపర్ ఓవర్ - 1 ఓవర్‌లో 19/2

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha