Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాడ్‌ధాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి

తాడ్‌ధాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి

వార్త 2 weeks ago

Sangareddy PDS Rice Seized: గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం. సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల పరిధిలోని 161 జాతీయ రహదారిపై తాడ్‌ధాన్‌పల్లి టోల్‌ప్లాజా వద్ద బుధవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన డీసీఎం వాహనంలో సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వెంటనే బియ్యంతో పాటు డీసీఎం వాహనాన్ని సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం పుల్కల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న విషయాన్ని సివిల్ సప్లయ్స్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. బియ్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు Sangareddy PDS Rice Seized: కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పురపాలక కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే వాయిదా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha