Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'టాక్సిక్' నుండి మొదటి వీడియో సాంగ్ విడుదల

'టాక్సిక్' నుండి మొదటి వీడియో సాంగ్ విడుదల

వార్త 1 month ago

Yash Toxic movie: యశ్‌ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' నుంచి 'తబాహి' పేరుతో తొలి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పాటలో యశ్‌, కియారాల జోడీ, వారి మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. విజువల్స్ పరంగా పాట బాగుందని చెప్పచ్చు. ఈ పాట తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

Read Also : Preethi Mukundan : మెగా ఛాన్స్ మిస్ చేసుకున్న 'బ్లాస్ట్' బ్యూటీ

 First video song from 'Toxic' released.

Yash Toxic movie: భారీ తారాగణంతో గీతూ మోహన్ దాస్ దర్శకత్వం

గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి భారీ తారాగణం నటిస్తోంది. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ సంగీతం అందిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై యశ్‌ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సౌరవ్ గంగూలీ బయోపిక్.. 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha