Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'టాక్సిక్' సినిమా ఆలస్యంపై స్పందించిన యశ్‌

'టాక్సిక్' సినిమా ఆలస్యంపై స్పందించిన యశ్‌

వార్త 6 days ago

Toxic movie: కన్నడ సూపర్ స్టార్ యశ్, తన చిత్రం 'టాక్సిక్' (Toxic) పై వస్తున్న రూమర్లకు నోరు విప్పారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్, విడుదల తేదీల చుట్టూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 'టాక్సిక్' సినిమా ఆలస్యం కావడంపై హీరో యశ్ తాజాగా అధికారికంగా స్పందించారు. టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేవలం భారతీయ సినిమాగానే కాకుండా, గ్లోబల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Read Also : Sreeleela Dating Rumours: శ్రీలీల డేటింగ్ పుకార్లపై స్పందించిన తల్లి

Toxic movie: కొన్ని మార్పులు కారణంగా వాయిదా!

నిజానికి 'టాక్సిక్' సినిమాను జూన్ 4వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ను మరింత పెద్దదిగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ భారీ మార్పుల వల్లే అనుకున్న సమయానికి సినిమాను తీసుకురాలేకపోయామని, విడుదల తేదీని వాయిదా వేయాల్సి వచ్చిందని యశ్ వెల్లడించారు. భారతదేశంలో షూటింగ్ ప్రారంభం కాగానే విడుదలపై అంచనాలు పెరిగిపోతాయని, అయితే తన విజన్ మాత్రం చాలా పెద్దదని యశ్ స్పష్టం చేశారు.

హాలీవుడ్ స్టైల్లో ప్లానింగ్

భారత్‌లో ఒక సినిమాను ప్రకటించగానే బిజినెస్, మార్కెటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కానీ హాలీవుడ్‌లో అలా కాదు, సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే అసలు వ్యాపారం జరుగుతుంది. అక్కడ పెట్టుబడిదారులు, డిస్ట్రిబ్యూటర్లు పూర్తి అవుట్‌పుట్ చూశాకే నిర్ణయాలు తీసుకుంటారు అని యశ్ తెలిపారు. ప్రస్తుతం 'టాక్సిక్' సినిమాను కూడా అదే హాలీవుడ్ స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచ స్థాయి కంటెంట్‌ను అందించే క్రమంలోనే ప్రీ-ప్రొడక్షన్, మేకింగ్ విషయాల్లో అస్సలు రాజీ పడకుండా పని చేస్తున్నామని, అందుకే కొంచెం సమయం పడుతుందని యశ్ పేర్కొన్నారు.కాబట్టి అభిమానులంతా ఈ ఆలస్యాన్ని అర్థం చేసుకుని, తమకు సహకరించాలని యశ్ కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha