అఫ్గానిస్తాన్‌లో మహిళలు, బాలికల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ తాలిబాన్ పాలకులు మరో వివాదాస్పద చట్టాన్ని తెరపైకి తెచ్చారు. తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా నేతృత్వంలో 'ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ స్పౌసెస్' పేరుతో కొత్త కుటుంబ చట్టాన్ని ఆమోదించారు.
మొత్తం 31 ఆర్టికల్స్‌తో కూడిన ఈ వివాదాస్పద నిబంధనలు అఫ్గాన్ మహిళల స్వేచ్ఛను పూర్తిగా సమాధి చేసేలా ఉన్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.
Read Also: Jets collision: అమెరికా ఎయిర్ షోలో ఘోర ప్రమాదం: గాల్లోనే ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు
Afghanistan Women
Afghanistan Women: లింగ వివక్షతో కూడిన కొత్త నిబంధనలు
ఈ కొత్త చట్టం ప్రకారం, ఒక యుక్తవయస్సుకు వచ్చిన బాలికకు వివాహం నిశ్చయించినప్పుడు ఆమె గనుక ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉంటే.. ఆ మౌనాన్ని పెళ్లికి పూర్తి అంగీకారంగానే పరిగణిస్తారు. అయితే, ఈ విచిత్ర నిబంధన అబ్బాయిలకు కానీ, లేదా గతంలో వివాహమై విడాకులు తీసుకున్న/భర్త చనిపోయిన మహిళలకు కానీ వర్తించదు. వారు తమ పెళ్లికి కచ్చితంగా నోటితో చెప్తూ అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది. కేవలం కన్యల విషయంలోనే ఈ మౌన నిబంధనను తీసుకురావడం తీవ్ర లింగ వివక్షకు అద్దం పడుతోందని నిపుణులు విమర్శిస్తున్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఈ చట్టంలో కీలక అధికారాలను పురుషులకు కట్టబెట్టారు. మైనర్ బాలికలకు వివాహాలు చేసే పూర్తి హక్కులను తండ్రి, తాతలకు ఇచ్చారు. 2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల స్వేచ్ఛను హరించేలా వరుస ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

