Pooja Hegde : ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలతో దూసుకెళ్లిన బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఇప్పుడు మరోసారి తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆమె, మళ్లీ టాలీవుడ్‌లో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన పూజా హెగ్డే :
‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’ వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన పూజా హెగ్డే కెరీర్‌కు ‘రాధే శ్యామ్’ తర్వాత కొంత బ్రేక్ పడింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గినట్లు కనిపించింది.

అంతేకాదు, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ చిత్రంలో తొలుత పూజా హెగ్డేనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే అనివార్య కారణాలతో ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, ఆమె స్థానంలో శ్రీలీల వచ్చి చేరింది. ఈ పరిణామం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం పూజా హెగ్డే దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘శ్రీశ్రీ’ సినిమాలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఆమె చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలుగు దర్శకులు, నిర్మాతల కథలు కూడా ఆమె వింటోందని, సరైన స్క్రిప్ట్ దొరికితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. టాలీవుడ్‌లో మరోసారి తన స్టార్ ఇమేజ్‌ను తిరిగి సంపాదించుకోవాలనే లక్ష్యంతో పూజా హెగ్డే అడుగులు వేస్తోందనే టాక్ వినిపిస్తోంది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

