Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

వార్త 2 months ago

DC vs CSK Live Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నారు.

ఈ సీజన్‌లో మెజారిటీ జట్లు చేజింగ్‌కే మొగ్గు చూపుతున్న తరుణంలో, అక్షర్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పిచ్ కండిషన్స్ మరియు ప్లేఆఫ్స్ సమీపిస్తున్న తరుణంలో ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also:Hardik Pandya Injury Update:వెన్నునొప్పితో లక్నో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్

 DC vs CSK

DC vs CSK Live Updates: జట్టులోకి లుంగీ ఎన్గిడి పునరాగమనం

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ ఊరట లభించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కంకషన్ (తలకు గాయం) బారిన పడి విశ్రాంతి తీసుకున్న దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎన్గిడి తిరిగి జట్టులోకి వచ్చాడు. వైద్య పరీక్షల అనంతరం అతను ఫిట్‌గా ఉన్నట్లు తేలడంతో, కైల్ జేమీసన్ స్థానంలో తుది జట్టులోకి చేరాడు. ఎన్గిడి రాకతో ఢిల్లీ బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైంది.

ప్లేఆఫ్స్ దిశగా ఇరు జట్ల పోరు

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇరు జట్లు ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతున్నాయి. గత మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించగా, చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ బెర్తును మరింత ఖాయం చేసుకునే అవకాశం ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

"నువ్వో ప్రొఫెషనల్ క్రికెటర్‌వి.. ఇదేం బౌలింగ్?"

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha