Dailyhunt
తగ్గిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా?

తగ్గిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా?

వార్త 1 week ago

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్న ముడి చమురు ధరలు (Oil price) బుధవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో రెండు వారాల పాటు దాడుల నిలిపివేతను (Ceasefire) ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం.

ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధర (oil price) భారీగా పతనమైంది. గత కొన్ని వారాలుగా ఆకాశాన్ని తాకుతున్న ఇంధన ధరల నుండి సామాన్యులకు ఇది ఒక గొప్ప ఊరట అని చెప్పవచ్చు. గంటల్లోనే మారిన లెక్కలు బుధవారం ఉదయం వరకు బ్యారెల్‌కు 109.77 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర, ట్రంప్ ప్రకటన తర్వాత ఏకంగా 95.068 డాలర్లకు పడిపోయింది. అలాగే అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ కూడా బ్యారెల్‌కు దాదాపు 20 డాలర్ల మేర తగ్గింది. యుద్ధ భయంతో ఫిబ్రవరి 28 నుండి పెరుగుతూ వచ్చిన ఆయిల్ ధరలు, మార్చి నెలలో ఏకంగా 50 శాతం పైగా పెరిగి రికార్డు సృష్టించాయి.

Read Also: US Iran Ceasefire News: ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

 Oil price

Oil price: ‘హోర్ముజ్ జలసంధి’ మళ్లీ తెరుచుకోనుంది

అయితే ఇప్పుడు యుద్ధ విరమణ సంకేతాలతో మార్కెట్ ఒక్కసారిగా చల్లబడింది. హోర్ముజ్ జలసంధి ఎందుకు ముఖ్యం? ఈ యుద్ధ విరమణ వల్ల ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ మళ్లీ తెరుచుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఆయిల్ , గ్యాస్‌లో ఐదో వంతు ఈ సన్నని జలమార్గం ద్వారానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాల నుండి ఆయిల్ బయటకు రావాలంటే ఇదే ప్రధాన మార్గం. ఇరాన్ దీనిని మూసివేయడంతో సరఫరా నిలిచిపోయి చమురు ధర పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ట్యాంకర్ల రాకపోకలు మొదలవడంతో ధరలు దిగివస్తున్నాయి. మార్కెట్ల స్పందన ఎలా ఉంది? ట్రంప్ ప్రకటనతో కేవలం ఆయిల్ మాత్రమే కాదు, ఇతర మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కాల్పులు ఆపాలని సైన్యాన్ని ఆదేశించిన ఇరాన్ అధ్యక్షుడు మొజ్తాబా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha