Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లి ఆత్మహత్య..మృతదేహం పక్కనే రాత్రంతా ఏడ్చిన చిన్నారి

తల్లి ఆత్మహత్య..మృతదేహం పక్కనే రాత్రంతా ఏడ్చిన చిన్నారి

వార్త 2 weeks ago

Kurnool Crime: కన్నతల్లి ఇక లేదనే విషయం తెలియని ఓ పసివాడు.. అమ్మా అని పిలుస్తూ ఆమె పక్కనే రాత్రంతా గడిపాడు. తల్లి పలుకుతుందేమోనని ఎదురుచూశాడు.

కాళ్లను పట్టుకుని ముద్దాడినా, ఎంతగా పిలిచినా ఆమె నుంచి స్పందన రాకపోవడంతో ఆ చిన్నారి కన్నీరుమున్నీరయ్యాడు. చివరకు ఏడ్చి ఏడ్చి స్పృహతప్పిపోయాడు. ఉదయం పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లడంతో ఈ హృదయవిదారక దృశ్యం వెలుగులోకి వచ్చింది. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన స్వాతికి హైదరాబాద్‌కు చెందిన గణేశ్‌తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అయితే కొంతకాలం తర్వాత కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. దంపతుల మధ్య తలెత్తిన కుటుంబ కలహాలు చివరకు విడిపోవడానికి దారితీశాయి. దాదాపు ఏడాది క్రితం స్వాతి, గణేశ్ విడిపోయారు. అప్పటి నుంచి స్వాతి తన కుమారుడు శ్రీయాన్‌తో కలిసి కర్నూలులోని వెంకటరమణ కాలనీలో నివసిస్తోంది. ఆమె తల్లి కళావతి కూడా కొంతకాలంగా వారితోనే ఉంటూ మనవడి ఆలనాపాలనా చూసుకునేవారు.

Madhya Pradesh Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనం

 Kurnool Crime

హైదరాబాద్‌కు వెళ్లిన తల్లి.. ఇంట్లో ఒంటరిగా స్వాతి

మూడు రోజుల క్రితం స్వాతి తల్లి కళావతి హైదరాబాద్‌లో నివసిస్తున్న తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్లారు. దీంతో స్వాతి తన కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. శుక్రవారం రాత్రి స్వాతి చుట్టుపక్కల వారితో మాట్లాడింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో హైదరాబాద్‌లో ఉన్న తన తల్లి కళావతితో కూడా ఫోన్‌లో మాట్లాడింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మరుసటి రోజు ఉదయం ఆమె ఇంట్లో నుంచి ఎలాంటి కదలికలు కనిపించలేదు. శనివారం ఉదయం చాలాసేపటి వరకు స్వాతి ఇంటి తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఇంట్లో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. పడకగదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని స్వాతి మృతిచెంది కనిపించింది. ఆమె పాదాల దగ్గర ఉన్న స్టూల్‌పై చిన్నారి శ్రీయాన్ స్పృహతప్పి పడిపోయి ఉన్నాడు.

Kurnool Crime: తల్లి మృతదేహం పక్కనే రాత్రంతా చిన్నారి

పోలీసులు గుర్తించిన దృశ్యం అక్కడున్న వారందరినీ కన్నీళ్లు పెట్టించింది. తల్లి మరణించిన విషయం తెలియని చిన్నారి ఆమె పక్కనే రాత్రంతా గడిపినట్లు తెలుస్తోంది. తల్లి ఉరి వేసుకున్న సమయంలో ఉపయోగించిన స్టూల్‌పైనే చిన్నారి కూడా పడుకుని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అమ్మా అని పిలుస్తూ, ఆమెను తాకుతూ స్పందన కోసం ఎదురుచూసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఎంతగా ఏడ్చినా తల్లి పలకకపోవడంతో చివరకు అలసిపోయి స్పృహతప్పి పడిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కొద్దిసేపు బాలుడిని తట్టిలేపడంతో అతడు స్పృహలోకి వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Read Also hindi news: hindi.vaartha.com

పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒక వ్యక్తి మృతి, పోలీసు అధికారికి గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha