Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తల్లికి వందనం పేరుతో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం!

తల్లికి వందనం పేరుతో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం!

వార్త 1 week ago

Thalliki Vandanam Scam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'తల్లికి వందనం' (Talliki Vandanam) పేరుతో కర్నూలు జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.

పథకం నగదు జమ అవుతున్న తరుణాన్ని ఆసరాగా చేసుకుని ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్ పర్సన్లు లబ్ధిదారులకు వల వేసి, ఏకంగా 28 మంది ఖాతాల నుంచి సొమ్మును ఊడ్చేశారు.

Read Also :Myanmar: సైబర్ మోసాలపై మయన్మార్‌లో కఠిన చట్టం

ఉచిత సిమ్‌ల పేరుతో బయోమెట్రిక్ సేకరణ

నిందితులు ‘తల్లికి వందనం’ పథకం ప్రయోజనాలు పొందడానికి లేదా కొత్త సిమ్ కార్డులు ఉచితంగా ఇస్తామంటూ స్థానికులను నమ్మించారు. సిమ్‌లు ఇచ్చే క్రమంలో లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు (Biometrics), ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించారు. ఆ వివరాలను దుర్వినియోగం చేస్తూ, లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న పథకం డబ్బులను తమ స్వప్రయోజనాల కోసం అక్రమంగా డ్రా చేసుకున్నారు.

పోలీసుల కఠిన చర్యలు.. ఇద్దరు అరెస్ట్

సొమ్ము మాయమైన విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా వేగంగా స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉపేంద్ర, వీరారెడ్డి అనే ఇద్దరు ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Thalliki Vandanam Scam: ప్రజలకు అధికారుల తీవ్ర హెచ్చరిక

ఈ తరహా ఘటనల నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.ఉచిత సిమ్‌లు, పథకాలు ఇప్పిస్తామంటూ వచ్చే అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు (OTP), వేలిముద్రలు (Biometrics) ఇవ్వకూడదు. పథకాలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం లేదా పాఠశాల అధికారులను మాత్రమే సంప్రదించాలి.

ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఏడుపు ఆపని కొడుకును చంపిన తల్లి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha