Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడులో డీఎంకే.. బెంగాల్‌లో బీజేపీ?

తమిళనాడులో డీఎంకే.. బెంగాల్‌లో బీజేపీ?

వార్త 2 months ago

తమిళనాడులో డీఎంకే ఆధిక్యం

Tamil Nadu election : తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాపోల్ అనే సర్వే సంస్థ తన ప్రీ పోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది.

ఈ సర్వే ప్రకారం డీఎంకే పార్టీ మరోసారి అధికారంలోకి రానుందని అంచనా వేసింది. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే పార్టీ సొంతంగా 117 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది.

కూటమి లెక్కలు

డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (SPA) మొత్తం 150 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఈ కూటమిలో కాంగ్రెస్‌కు 16, DMDKకు 7, VCKకు 4, CPIకు 3, CPM మరియు IUMLలకు ఒక్కో స్థానం వచ్చే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు ప్రతిపక్ష కూటమి కేవలం 70 స్థానాలకు పరిమితమయ్యే అవకాశముందని తెలిపింది.

Read Also : KCR: మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే - కేసీఆర్ ధీమా

 Tamil Nadu election

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం

ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రజాపోల్ అనలిటిక్స్ సంస్థ అంచనా వేసింది. మొత్తం 294 స్థానాల్లో బీజేపీ 167 స్థానాల్లో గెలుస్తుందని, వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈసారి 126 స్థానాలకు పరిమితమయ్యే అవకాశముందని పేర్కొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెట్రోల్ ధర లీటర్ కు రూ. 15 పెరగనుందా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha