Tamil Nadu Assembly Elections 2026: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు (గురువారం, ఏప్రిల్ 23) ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
గత కొద్ది రోజులుగా సాగిన హోరాహోరీ ప్రచారం నిన్నటితో ముగిసింది. ఇప్పుడు బంతి ఓటర్ల కోర్టులో ఉంది.
Polling tomorrow in Tamil Nadu
Tamil Nadu Assembly Elections 2026: ఎన్నికల గణాంకాలు
- అభ్యర్థుల సంఖ్య: 4,023 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
- పోలింగ్ సమయం: ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు. ఫలితాల తేదీ: మే 4, 2026.
- మొత్తం ఓటర్లు: సుమారు 5.67 కోట్లు.
త్రిముఖ పోరు – ప్రధాన కూటములు
ఈసారి ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ద్వైపాక్షిక పోరులోకి దళపతి విజయ్ ప్రవేశించడంతో సమీకరణాలు మారాయి. డీఎంకే కూటమి (SPA): ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. ఏఐఏడీఎంకే కూటమి (NDA): ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే, బీజేపీ మరియు పీఎంకే వంటి పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. తమిళ వెట్రి కళగం (TVK): నటుడు విజయ్ తన పార్టీని ఒంటరిగా బరిలోకి దింపి, ‘మార్పు’ నినాదంతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ స్వయంగా విరుగంబాక్కం మరియు తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేస్తున్నారు.
గత ఎన్నికల ఫలితాలు (2021)
- DMK: 133
- AIADMK: 66
- INC: 18
- BJP: 04
- ఇతరులు: 13
ఈసారి అధికార వ్యతిరేకతను అధిగమించి స్టాలిన్ మళ్ళీ గెలుస్తారా? లేక ఏఐఏడీఎంకే పుంజుకుంటుందా? ‘విజిల్’ గుర్తుతో వచ్చిన విజయ్ కింగ్ మేకర్ అవుతారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

