Dailyhunt
తమిళనాడులో 'విజయ్' సునామీ.. నటుడు శ్రీమాన్ విజిల్స్

తమిళనాడులో 'విజయ్' సునామీ.. నటుడు శ్రీమాన్ విజిల్స్

వార్త 5 days ago

Tamil Nadu Election Results 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో దళపతి విజయ్ తన సత్తా చాటుతున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం TVK పార్టీ ఏకంగా 105 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఇది చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒక కొత్త పార్టీ మొదటి ఎన్నికల్లోనే సెంచరీ మార్కును దాటడం తమిళ రాజకీయాల్లో ఇదే తొలిసారి.

Read Also:Vijay Election Affidavit: విజయ్ ఆస్తులు రూ. 603 కోట్లు: అఫిడవిట్‌లో కళ్లు చెదిరే నిజాలు వెల్లడి!

Tamil Nadu Election Results 2026: విజయ్ ఇంట్లో పండుగ

తమ నాయకుడు అద్భుతమైన ఆధిక్యంలో ఉండటంతో విజయ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. విజయ్ సన్నిహితుడు, నటుడు శ్రీమాన్ విజిల్స్ వేస్తూ, డాన్స్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. విజయ్ కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు గెలుపు ధీమాతో సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్ నివాసం వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, తొక్కిసలాటలు జరగకుండా విజయ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర వాహనాలు ఆయన ఇంటి వైపు వెళ్లకుండా దారి మళ్లించి, భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే సాధిస్తున్న ఈ ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha