Tamil Nadu Gas Leak: తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన పారిశ్రామిక ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లాలోని ఒక ప్రైవేట్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో అమోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో ఏడుగురు కూలీలు ఊపిరాడక ప్రాణాలు విడిచారు.
మరణించిన వారిలో ఆరుగురు మహిళా కార్మికులు ఉండటం గమనార్హం. ఈ ప్రమాద తీవ్రత కారణంగా మరో 74 మందికి పైగా సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

read also: NEET Re-exam 2026: భారీ భద్రత నడుమ మొదలైన నీట్ రీ ఎగ్జామ్.
కాలుష్య కోరల్లో కన్నిగైపెట్టై: అసలేం జరిగింది?
పెరియపాళయం పరిధిలోని కన్నిగైపెట్టై గ్రామంలో ఈ సీఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నడుస్తోంది. ఎప్పటిలాగే కార్మికులు విధుల్లో ఉండగా, కోల్డ్ స్టోరేజ్ (శీతలీకరణ) విభాగానికి చెందిన ఒక కీలకమైన వాల్వ్ పాడవడంతో అమోనియా వాయువు ఒక్కసారిగా బయటకు పొక్కేసింది. దాంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకోలేక అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు. బాధితుల్లో అత్యధికులు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన 24-25 ఏళ్ల వయసున్న యువతులేనని ప్రాథమిక సమాచారం.
Tamil Nadu Gas Leak: విషమంగా పలువురి పరిస్థితి: విచారణకు కలెక్టర్ ఆదేశం
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం, తోటి సిబ్బంది బాధితులను స్థానిక వేల్స్, వెంకటేశ్వర ఆసుపత్రులకు తరలించారు. అయితే, వీరిలో 9 మంది పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 11 మంది క్షతగాత్రులు వెంటిలేటర్లపై మృత్యువుతో పోరాడుతున్నట్లు, పలువురికి ఇంట్యూబేషన్ చికిత్స అందిస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
దుర్ఘటన విషయం తెలియగానే తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎస్. కవిత ఘటనా స్థలితో పాటు ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించారు. ఫ్యాక్టరీలో జరిగిన భద్రతా లోపాలు, ప్రమాదానికి గల అసలు కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
read also:

