Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TamilNadu: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!

TamilNadu: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!

వార్త 4 months ago

మిళనాడు (TamilNadu) లో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని పెరవళ్లూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తున్న మహిళల గోప్యతను భంగం చేసేలా యువకుడు చేసిన చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఇంట్లో 11 మంది మహిళలు అద్దెకు ఉంటున్నారు. అందులో ఓ మహిళ గురువారం రాత్రి స్నానం చేస్తుండగా.. కిటికీలోంచి ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు.

Palnadu: వ్యభిచారానికి బలవంతం.. తల్లిని హత్య చేసిన కూతురు

కఠినమైన జైలు శిక్ష పడే అవకాశం

గమనించిన మహిళ పెద్దగా కేకలు వేయడంతో అతను పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చెంగల్పట్టు జిల్లా తిరువిడన్‌దైకు చెందిన సత్యరాజ్‌గా గుర్తించారు.నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు,

అందులోని వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. మహిళల గోప్యతకు భంగం కలిగించడం, అశ్లీల వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇలాంటి పనులకు కఠినమైన జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

National High way: ఇవాళ్టి నుంచి టోల్ వసూలు నిబంధనల్లో మార్పులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha