Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తన 158వ సినిమా టైటిల్‌ను లీక్ చేసిన చిరంజీవి

తన 158వ సినిమా టైటిల్‌ను లీక్ చేసిన చిరంజీవి

వార్త 1 week ago

Mega 158 Movie: మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాన్ని అనుకోకుండా బయటపెట్టేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న నటించిన 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్ వేదికపై ఆయన తన 158వ సినిమా టైటిల్‌ను స్వయంగా లీక్ చేశారు.

దీంతో గతంలో మాదిరిగానే మరోసారి '#ChiruLeaks' అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చి చక్కర్లు కొడుతోంది.

'కదిరి' టైటిల్ మరియు ఆగస్టు 22న టీజర్ విడుదల

డైరెక్టర్ కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 'కదిరి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిరు సరదాగా వేదికపై వెల్లడించారు. ఈవెంట్‌లో లీక్‌ల గురించి మాట్లాడుతున్న సమయంలో, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ వారించడానికి ప్రయత్నించినా.. "టీజర్ మ్యూజిక్ అయిందా? చివర్లో 'కదిరి' అని టైటిల్ పెట్టారా?" అంటూ ఆయన అడగడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా తన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.

Mega 158 Movie: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'కదిరి' సినిమా విశేషాలు

గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ, లోకేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన ప్రియమణి నటిస్తుండగా, రచితా రామ్, నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha