Pawan Kalyan Health Update: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. మంగళగిరిలో నిర్వహించిన 'జనసేన ఉద్యమి' ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన, తన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా వివరించడంతో జనసైనికులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి వేదికగా జరిగిన ఆత్మీయ కలయికలో ఆయన నేరుగా స్పందించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని, పూర్తిగా కోలుకుంటున్నానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది, ఆరాతీసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Read also: Rajnath Singh Puttaparthi Visit: సీఎం చంద్రబాబుపై రాజ్‌నాథ్ ప్రశంసలు
సైనస్ సమస్య.. భుజంలో కండ తెగింది!
సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తనకు ఎదురైన ఆరోగ్య సమస్యల తీవ్రతను పంచుకున్నారు. “కొంతకాలంగా సైనస్ సమస్య నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అంతేకాకుండా, భుజం మధ్య భాగంలో ఒక చిన్న కండ తెగింది (Muscle Tear). దీనివల్ల తీవ్రమైన నొప్పిని అనుభవించాల్సి వచ్చింది” అని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ, గతంలో తాను తీసుకున్న మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ వల్ల ఆ శారీరక నొప్పిని తట్టుకోగలిగానని, మానసిక స్థైర్యంతో దాన్ని అధిగమించానని పేర్కొన్నారు.
Janasena party leaders and supporters gathered in Mangalagiri to attend Pawan Kalyan’s interactive session
Pawan Kalyan Health Update: మళ్లీ ఫుల్ జోష్‌లో జనసేనాని..
ఎన్నికల తదనంతర పరిణామాలు, ప్రభుత్వ బాధ్యతలతో తీరిక లేకుండా గడిపిన పవన్ కల్యాణ్, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ మంగళగిరి పార్టీ కార్యాలయం వేదికగా రాజకీయంగా, ప్రభుత్వపరంగా యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ పూర్తిగా రికవర్ అయ్యానని, ప్రజల కోసం పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అధినేత స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో జనసేన శ్రేణుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం నెలకొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

