Tamil Nadu Elections: తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తన కారు డ్రైవర్‌పై ఉన్న నమ్మకానికి, కృతజ్ఞతకు నిదర్శనంగా ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి విజయ్ తన గొప్ప మనసును చాటుకున్నారు.
Read Also:PAN card new rules: ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
Tamil Nadu Elections: విజయ్ ‘నమ్మకానికి’ నిలువెత్తు సాక్ష్యం
విజయ్ తన అభ్యర్థుల ఎంపికలో సామాన్యులకు, కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. గత 30 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్‌కు కృతజ్ఞతగా, ఆయన కుమారుడు శబరినాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. చెన్నైలోని విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి శబరినాథన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.
Thalapathy Vijay TVK MLA Ticket to Driver Son
వేదికపై ఈ ప్రకటన చేయగానే రాజేంద్రన్, శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్‌ను హత్తుకుని, ఆయన పాదాలపై పడుతూ తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ దృశ్యం సభలో ఉన్న వారిని కదిలించింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, "మా పార్టీ సామాన్య ప్రజలకు అవకాశం ఇస్తుంది. వారసత్వ రాజకీయాలకు, డబ్బు ఆధారిత రాజకీయాలకు మా వద్ద స్థానం లేదు. చదువుకున్న యువతకు పెద్దపీట వేస్తున్నాం" అని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

