Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

వార్త 1 month ago

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు కవిత మధ్య మాటల యుద్ధం హీటెక్కింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కవిత చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ రాజగోపాల్ రెడ్డి చేసిన ఘాటు విమర్శలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Read Also: Telangana Govt: 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్!

 Komatireddy Rajagopal Reddy fires back at Kavitha for her comments on KCR

Komatireddy Raj Gopal Reddy: కవిత వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ పోరు వీధికెక్కిందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఒక ఉద్యమకారుడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని గుర్తు చేస్తూ.. అటువంటి తండ్రిని సొంత కూతురే విమర్శించడం బాధాకరమన్నారు. “కవితకైనా, కేటీఆర్‌కైనా, హరీష్ రావుకైనా గుర్తింపు వచ్చింది. కేసీఆర్ వల్లే. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది?” అని ఆయన ప్రశ్నించారు.

కుటుంబ విలువలు – రాజకీయ ఆకాంక్షలు

రాజగోపాల్ రెడ్డి కవితకు కొన్ని హితవులు పలికారు.కవిత పార్టీ పెద్ద జోక్.ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? తండ్రికి కూతురు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది, కూతురికి కూడా తండ్రి అంటే చాలా ప్రేమ ఉంటుంది.తన తొలి సమావేశంలోనే కవిత తప్పు చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రజలందరూ ఆలోచించుకుంటారు. తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు తల్లి ఎలా అవుతుంది?అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha