Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తరగతి గదిలో నిద్రిస్తున్న బాలుడిని వదిలేసి స్కూల్‌కు తాళం వేసిన సిబ్బంది: 9 మంది సస్పెన్షన్

తరగతి గదిలో నిద్రిస్తున్న బాలుడిని వదిలేసి స్కూల్‌కు తాళం వేసిన సిబ్బంది: 9 మంది సస్పెన్షన్

వార్త 1 week ago

Student Locked In School : జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. తరగతి గదిలో నిద్రపోయిన ఏడో తరగతి విద్యార్థిని గమనించకుండా స్కూలుకు తాళం వేసి వెళ్ళిపోవడంతో, ఆ బాలుడు గంటల తరబడి లోపలే చిక్కుకుపోయాడు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయుడితో సహా మొత్తం తొమ్మిది మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు.

Read Also: Journalist KVR wife Zero FIR: జర్నలిస్ట్ KVR భార్యపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు

 Student Locked In School

Student Locked In School : సెలవుల ముందు రోజు జరిగిన దారుణం

బనిహాల్ జోన్‌లోని క్రావా ప్రభుత్వ మిడిల్ స్కూల్‌లో జులై 4న ఈ ఘటన జరిగింది. జమ్మూకశ్మీర్‌లో జులై 6 నుంచి 15 రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించడంతో, సెలవులకు ముందు చివరి పనిదినం కావడంతో శనివారం పాఠశాల ముగిసిన వెంటనే సిబ్బంది హడావుడిగా తాళాలు వేసి వెళ్లిపోయారు. అయితే క్లాస్‌రూమ్‌లో నిద్రిస్తున్న విద్యార్థిని ఎవరూ గమనించలేదు. రాత్రి 8 గంటల సమయంలో బాలుడు మేల్కొని భయంతో కేకలు వేయడంతో, అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి తాళాలు పగులగొట్టి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాంబన్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (CEO) స్పందిస్తూ పాఠశాల హెడ్‌మాస్టర్, ఆరుగురు టీచర్లు, ఇద్దరు సహాయక సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ దారుణంపై సమగ్ర విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులు ఆదేశించారు.

Epaper: epaper.vaartha.com

లారీని ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు.. డ్రైవర్‌తో సహా ఇద్దరు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha