Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టర్కీ ముందు ఉగాండా జనరల్ వింత డిమాండ్లు

టర్కీ ముందు ఉగాండా జనరల్ వింత డిమాండ్లు

వార్త 2 months ago

Muhoozi Kainerugaba: ఉగాండా దేశాధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు, ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) ముహూజీ కైనెరుగబా అంతర్జాతీయ దౌత్య వర్గాలను ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేశారు.

తుర్కియే ప్రభుత్వం తమకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు) చెల్లించాలని, అలాగే ఆ దేశంలోని అత్యంత అందమైన అమ్మాయిని తనకిచ్చి వివాహం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను 30 రోజుల్లోగా నెరవేర్చకపోతే ఉగాండాలోని తుర్కియే రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.

Read Also:US Iran peace talks : నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం

Muhoozi Kainerugaba: 30 రోజుల్లోపు తీర్చకపోతే

ఒకవేళ టర్కీ ఈ డిమాండ్లను 30 రోజుల్లోపు తీర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కైనెరుగాబా హెచ్చరించారు. అంతేకాకుండా ఉగాండా రాజధాని కంపాలాలో ఉన్న టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని, అలాగే టర్కీ విమానాలు తమ గగనతలంపై ఎగరకుండా నిషేధిస్తామని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఉగాండా ప్రజలు ఎవరూ టర్కీకి ప్రయాణించవద్దని, అది క్షేమం కాదని కూడా ఆయన సలహా ఇచ్చారు. ఇవే కాకుండా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా తాను స్వయంగా లక్ష మంది సైనికులను పంపి ఆ పవిత్ర భూమిని రక్షిస్తానని కూడా ఆయన ప్రకటించారు.

కైనెరుగబా ఇలాంటి విచిత్రమైన ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 అక్టోబర్‌లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీని వివాహం చేసుకునేందుకు ప్రతిఫలంగా ‘భూమిపై అత్యంత అందమైనవి’గా వర్ణించిన 100 అంకోలే ఆవులను ఇస్తానని బహిరంగంగా ప్రకటించి ఆయన వార్తల్లో నిలిచారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చందమామపై 'ట్రంప్ టవర్'..సోషల్ మీడియా లో ట్రంప్ పోస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha