Environmental crisis : ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచం పర్యావరణ దినో త్సవాన్ని జరుపుకుంటున్నాము. పాఠశాలల్లో మొక్కలు నాటడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రమాణా లు చేయడం, రాజకీయ నాయకులు ఫోటోలు దిగడం, కంపెనీలు ప్రకట నలు విడుదల చేయడం హంగు ఆర్భాటాలతో జరుగుతున్నాయి.
అయితే దేశంలో పర్యావరణం నిజం గా రక్షించబడుతోందా? అని చూస్తే దేశంలో వాయుకాలుష్యం పెరుగుతోంది, నదులు, సరస్సు లు కలుషితమవుతున్నాయి. క్రమంగా అడవులు తగ్గుతున్నాయి, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర ఉష్ణోగ్రతలు, వరదలు, కరవులు, అకాల వర్షాలు పెరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ నేడు ప్రకృతి సమస్య కాదు. ఇది దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఆరోగ్య, జాతీయ భద్రత సమస్యగా మారింది. భారతదేశం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభం ప్రము ఖంగా, భారత్ గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని వేడి తరంగాలను ఎదుర్కొంటోంది. ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో 50 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ప్రతి సంవత్సరం వేలాదిమంది వడదెబ్బలతో బాధపడుతున్నారు, వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతున్నాయి. భారత్ ప్రపంచ జనాభాలో 18 శాతం కలిగి ఉన్నా, ప్రపంచ మంచినీటి వనరుల్లో కేవలం 4 శాతం మాత్రమే ఉంది. ఇప్పటికే అనేక నగరాలలో నీళ్లులేని పరిస్థితిని చూస్తున్నాము. పలు అధ్య యనాల ప్రకారం 2030 నాటికి మరింత ప్రమాదం ఎదు ర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇక వాయు కాలుష్యానికి వస్తే ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల జాబితాలో అనేక భారత నగరాలు ఉన్నాయి.
Read Also: World Environment Day 2026: వాతావరణం మన చేతుల్లోనే..
Environmental crisis
Environmental crisis : నియంత్రణ లేకుండా జరిగే అభివృద్ధి
ఇందులో ముఖ్యంగా రాజకీయ నాయకుల పాత్రని చుస్తే ప్రతి ఎన్ని కల సమయంలో అభివృద్ధి పేరుతో భారీ ప్రాజెక్టులు ప్రకటి స్తారు. కానీ ఎన్ని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సక్రమంగా తీసుకుంటున్నారు? ఎన్ని అడవులు నాశనం అవుతున్నాయి? ఎన్ని నదులు పారిశ్రామిక కాలుష్యానికి బలవుతున్నాయి? ఇలా చూస్తుంటే చాలా సందర్భాల్లో రాజకీయ వ్యవస్థకు పర్యావరణం కంటే తక్షణ ఎన్నికల లాభాలే ముఖ్యమవుతున్నాయి. ప్రస్తుతం అండమాన్, నికోబార్ దీవులలో అడవుల విధ్వంసానికి ప్రధాన కారణం, వివాదాస్పదమైన రూ.72,000-81,000 కోట్ల ‘గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు’ ఈ భారీ మోలిక సదుపాయాల ప్రాజెక్టు 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది రాబోయే రెండు దశాబ్దాలలో, దీని కారణంగా సుమారు 7 నుండి 10 లక్షల చెట్లు నరికివేయబడతాయని అంచనా. అలానే ఛత్తీస్గఢ్, మణిపూర్ రాష్ట్రాలలో కూడా అటవీ పాంతం గనులకోసం కనుమరుగుకాబోతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కంటే ‘వ్యాపారం చేసే సౌలభ్యం’కు ప్రాధాన్యతనిచ్చినందుకు, ముసాయిదా పర్యావరణ ప్రభావ అంచనా (ఈ.ఐ.ఏ) నోటిఫికేషన్ 2020 పర్యావరణవేత్తలు పౌరసమాజం నుండి తీవ్రవిమర్శలను ఎదుర్కొంది. ప్రస్తు తం దేశంలో కార్పొరేట్ రాజకీయాలు అభివృద్ధి పేరుతో విధ్వంసము సృష్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ రాజకీయాలు అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. కార్పొరేట్ రంగం ఆర్థికాభివృద్ధి దేశానికీ అవసరం. కానీ నియంత్రణ లేకుండా జరిగే అభివృద్ధి పర్యావరణానికి ముప్పుగా మారుతుంది.
పర్యావరణ అవగాహన
ప్రధానంగా గనుల తవ్వకాలు, అడవుల విధ్వంసం, గిరిజనుల నిర్వా సనం, భూగర్భ జలాల కలుషితం, పారిశ్రామిక కాలుషం, నదుల్లో వ్యర్థాల విడుదల చేయడం, భూమిని, గాలిని కలుషితం చేస్తున్నారు. అనేక కంపెనీలు ‘గ్రీన్, సస్టైనబుల్ అనే ప్రచారం చేస్తాయి. కానీ వాస్తవంలో అధిక కర్బన ఉద్గారాలు విడుదల చేయడం, అధిక నీటి వినియోగం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇలా కొనసాగుతూ నే ఉంటాయి. నేటి జెన్ జి (భవిష్యత్తు తరం) అంటే 1997-2012 మధ్య జన్మించిన వారు, భారత జనాభాలో కీలక శక్తి వారే. భవిష్యత్ ఓటర్లు, ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, విధాన నిర్ణేతలు వారే. సోషల్ మీడియా ద్వారా పర్యావరణ అవగాహనను, ప్రజా ఒత్తిడిని, సమాచార వ్యాప్తి వేగంగా చేయగలరు. వినియోగదారులు ఏ ఉత్పత్తులు కొనాలి? ఏ కంపెనీలను బహిష్కరించాలి? అనేది భవి ష్యత్తు తరం నిర్ణయించగలదు. ఉదాహరణకు కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన సవాలునుచూశాం. భవిష్యత్తు లో యువత పర్యావరణ విధానాలను వాతావరణ చర్యలను ప్రభావితం చేయగల స్థితికి రావాలి. చాలామంది యువత డి.పిలు మార్చడం, హ్యాష్ట్యాగ్ పోస్టులు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారు. కానీ అసలు అవసరం ఏమిటంటే స్థానిక ఉద్యమాలు, చెరువుల పరిరక్షణ, చెట్ల సంరక్షణ, సమాచార హక్కు వినియోగం, ప్రజా సమస్యల్లో, విచారణలో పాల్గొనడం అవసరం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 48ఎ ప్రకారం రాష్ట్రం పర్యావరణాన్ని రక్షించాలి. ఆర్టికల్ 51ఎ(జి)ప్రకారం ప్రతి పౌరుడు ప్రకృతిని పరిరక్షించా ల్సిన బాధ్యత కలిగి ఉంటాడు.
Environmental crisis
ప్రకృతిని నాశనం చేసే అభివృద్ధి
అంటే పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ప్రజలరాజ్యాంగ విధి కూడా. అభివృద్ధి, పర్యావరణంపై చర్చ సందర్భాలలో అభివృద్ధి కావాలంటే కొంత పర్యావరణ నష్టంతప్పదు అనేది కొంత వరకు నిజం. కానీ సరైన ప్రశ్న ఏంటంటే ఏ అభి వృద్ధి? ఎవరి కోసం? ఎంత నష్టం? ఒక పరిశ్రమ 1000 ఉద్యోగాలు ఇస్తే, లక్షల మందికి నీటిసమస్య తెస్తే, ఆరోగ్య సమస్యలు తెస్తే, అది నిజమైన అభివృద్ధి కాదని ప్రశ్నించాలి. 2047 నాటికీ భారతదేశంలో ఇప్పటిలాగే కొనసాగితే నీటి కొరత, తీవ్ర ఉష్ణోగ్రతలు, ఆహారసంక్షోభం, కాలుష్య వ్యాధు లు పెరుగుతాయి. దేశం సుస్థిరమైనఅభివృద్ధి కోసం పునరు త్పాదక ఇంధనం, వర్షపు నీటిసంరక్షణ, పట్టణ ప్రణాళిక, అడవుల విస్తరణ వైపు వెళితే గ్రీన్ ఉద్యోగాలు పెరుగుతాయి. మనదేశంలో పర్యావరణ రక్షణకు పర్యావరణ నేరాలకు కఠిన శిక్షలు విధించడం, అడవుల సంరక్షణకు రాజకీయ ప్రమే యం లేకుండా స్వతంత్ర కమిషన్ ఏర్పాటుచేయడం, కాలు ష్య పరిశ్రమలపై కఠిన నియంత్రణ, పర్యావరణ డేటాను ప్రజలకు అందుబాటు ఉంచడం, పాఠశాలల్లో పర్యావరణ విద్యను ఆచరణాత్మకంగా చెయ్యడం, యువతకు గ్రీన్ వాలం టీర్ కార్యక్రమాలు స్థానిక సంస్థలకు అధిక అధికారాలు ఇవ్వడం, కైమేట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, పాశ్చాత్య దేశాలలో లాగా సమాజంలో సామూహిక సేవలు పెంచి, సామాజిక పర్యావరణ స్పృహను పెంచడం అవసరం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్అభివృద్ధిని కేవలం ఆర్థిక వృద్ధిగా చూడలేదు. ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ అని చెప్పారు. అడవులను కోల్పోయేది ఎక్కువగా గిరిజన సమాజాలే. లాభాలు పొందేది ప్రధానంగా పెద్ద పెట్టుబడి దారులు. ఈ అసమానత అంబేద్కర్ ఊహించినప్రజాస్వామ్య అభివృద్ధి నమూనాకు విరుద్ధం. అభివృద్ధి అవసరమే కానీ ప్రకృతిని నాశనం చేసే అభివృద్ధి చివరికి సమాజాన్నే నాశ నం చేస్తుంది. కార్పొరేట్ పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు పెరగాలి. అయితే ఇవన్నీ ప్రకృతి పరి రక్షణ, గిరిజన హక్కులు, పర్యావరణ న్యాయం అనే మూడు సూత్రాలపై ఆధారపడిఉండాలి. పర్యావరణ సంక్షోభంఅనేది చెట్ల కొరత సమస్య కాదు, అది రాజకీయ సంకల్పం, కార్పొ రేట్ల ల బాధ్యత, ప్రజల అవగాహన, యువత చైతన్యం, భవిష్యత్ తరాల మనుగడకు సంబంధించిన సమస్య.
-డాక్టర్ ఎ. భాగ్యరాజ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

