ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆర్సీబీ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లక్నోతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే 14 పాయింట్లతో హైదరాబాద్‌తో సమానంగా నిలుస్తుంది.
అయితే ఆర్సీబీ నెట్ రన్ రేట్ (+1.420) ప్రస్తుతం పట్టికలో ఉన్న అన్ని జట్ల కంటే మెరుగ్గా ఉండటం వల్ల, నేటి గెలుపుతో సన్‌రైజర్స్‌ను వెనక్కి నెట్టి ఆర్సీబీ అధికారికంగా టేబుల్ టాపర్‌గా అవతరిస్తుంది. మరోవైపు లక్నో వరుస ఓటములతో పట్టికలో చివరి స్థానంలో ఉంది, కాబట్టి ఈ మ్యాచ్ వారి ప్లేఆఫ్ ఆశలకు చావోరేవో లాంటిది.
Read Also : ఫీల్డింగ్ వైఫల్యాలే మా కొంపముంచాయి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆవేదన

టాస్ గెలిచిన బెంగళూరు.. లక్నో బ్యాటింగ్
లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో పిచ్ స్వభావం దృష్ట్యా రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నప్పటికీ, లక్ష్య ఛేదనలో ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద బలం. ఈ మ్యాచ్‌తో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో తన 200వ మ్యాచ్ ఆడుతూ ఒక అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం.
జట్ల వివరాలు
LSG తుది జట్టు: మిచెల్ మార్ష్, అర్షిన్ కుల్కర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ (C/WK), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేశ్ రాఠీ, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్. (ఇంపాక్ట్ ప్లేయర్: మయాంక్ యాదవ్).
RCB తుది జట్టు: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (C), జితేష్ శర్మ (WK), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, జోష్ హేజిల్‌వుడ్.
ఈ పోరులో ఆర్సీబీ బౌలర్లు లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేస్తే, టేబుల్ టాపర్ సీటును సొంతం చేసుకోవడం కోహ్లీ సేనకు పెద్ద కష్టమేమీ కాదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

