Dailyhunt
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం: 13 మంది మృతి!

టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం: 13 మంది మృతి!

వార్త 1 week ago

Israel Airstrike on Tehran: పశ్చిమాసియాలో యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు నేటితో ముగియనుండటంతో, ప్రపంచం మొత్తం మంగళవారం రాత్రి జరగబోయే పరిణామాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

మరోవైపు ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేసి 13 మందిని బలితీసుకోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది.

Read Also:Donald Trump : ట్రంప్ కు పదవి గండం ?

Israel Airstrike on Tehran: తాజా పరిణామాలు – ముఖ్యాంశాలు

సోమవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నివాస సముదాయాలు ధ్వంసమవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.”ఒప్పందం చేసుకోకపోతే మంగళవారం రాత్రి 8 గంటలకు యుద్ధ చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసం చూస్తారు” అని ట్రంప్ హెచ్చరించారు. ఆ గడువు నేటితో ముగియనుంది.

 Trump 48 hour deadline on Iran

అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ లెక్క చేయడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్‌కు తమ ప్రతాపం చూపిస్తామని ఎదురు కౌంటర్ ఇస్తోంది. హార్ముజ్ జలసంధిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మునుపటిలాంటి పరిస్థితులు ఇకపై ఉండబోవని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తులు చివరి ప్రయత్నంగా 45 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై ఎలాంటి స్పందన రాలేదు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో సహా కుటుంబ సభ్యులు, కీలక నేతలు హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.

    Read Also hindi news: hindi.vaartha.com

    Epaper : epaper.vaartha.com

    Read Also:

    ఇరాన్ నుంచి అమెరికాకు ఘాటు హెచ్చరిక

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha