Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తేజ సజ్జ 'జోంబీ రెడ్డి 2'లో బాలీవుడ్ హీరోయిన్?

తేజ సజ్జ 'జోంబీ రెడ్డి 2'లో బాలీవుడ్ హీరోయిన్?

వార్త 3 weeks ago

Teja Sajja Zombie Reddy 2: 'హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకుని గ్లోబల్ స్టార్‌డమ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జ, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు.

ప్రస్తుతం ఆయన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'మిరాయ్' (Mirai) చిత్రంతో బిజీగా ఉండగా.. మరోవైపు తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది మైల్‌స్టోన్‌గా నిలిచిన 'జోంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా రానున్న 'జోంబీ రెడ్డి 2'ను కూడా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజా ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. 'జోంబీ రెడ్డి 2'లో కథానాయిక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె, స్టార్ కిడ్ షనయా కపూర్ పేరును చిత్రబృందం పరిశీలిస్తోందట. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాణ సంస్థ ఇప్పటికే ఆమెతో ప్రాథమిక చర్చలు కూడా జరిపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ టాక్స్ సక్సెస్ అయితే, గ్లామరస్ బ్యూటీ షనయా కపూర్ ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌తోనే టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

read also: Thavvai movie: ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న 'తవ్వై'!

 Bollywood actress in Teja Sajja's 'Zombie Reddy 2'?

Teja Sajja Zombie Reddy 2: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో..

తొలి భాగానికి దర్శకత్వం వహించి టాలీవుడ్‌కు సరికొత్త ‘జాంబీ’ కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఈ సీక్వెల్‌కు కేవలం కథను మాత్రమే అందించనున్నట్లు సమాచారం. తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల, 'జోంబీ రెడ్డి 2' సీక్వెల్‌కు మరో క్రేజీ డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు వినికిడి. మొదటి భాగం చిన్న బడ్జెట్‌తో వచ్చి బ్లాక్‌బస్టర్ అవ్వడంతో, ఈ రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేశారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. విజువల్స్ పరంగా, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. తేజ సజ్జ పాన్ ఇండియా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథలో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ మరియు దర్శకుడికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.

read also:

నాటకరంగ దిగ్గజం విజయా మెహతా కన్నుమూత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha