TGRTC Strike: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కార్మికులు తమ హక్కుల సాధన కోసం మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ (JAC) ప్రతినిధులు ప్రకటించారు.
Read Also:Uday Kiran: మరణంలోనూ సజీవం: 8 మందికి ప్రాణదానం చేసి 'రియల్ హీరో'గా నిలిచిన ఉదయ్ కిరణ్
TGRTC Strike: కార్మికులకు జేఏసీ పిలుపు
లేబర్ ఆఫీస్ వద్దకు కార్మికులందరూ చేరుకోవాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లపై గళమెత్తాలని కార్మికులకు సూచించింది. కార్మికులందరూ ఏకం కావాలని పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల వేతనాలు, సర్వీస్ సమస్యలు, బెనిఫిట్స్ వంటి అంశాలపై దీర్ఘ కాలంగా అసంతృప్తితో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఆందోళన తీవ్రత పెరుగుతోంది. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ స్పందన ఇవ్వకపోతే సమ్మె తప్పదని జేఏసీ స్పష్టం చేసింది.
TGSRTC JAC Strike Notice
ఇప్పటికే మార్చి 13వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సమ్మెకు వెళ్లాల్సి వస్తే దాని బాధ్యత ప్రభుత్వానిదేనని జేఏసీ నాయకులు హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఈ దశకు చేరిందని వారు పేర్కొన్నారు. దీంతో, ఈ చర్చలు సఫలమవుతాయా లేదా సమ్మెకు దారి తీస్తాయా అన్నది ఈ రోజు స్పష్టత రానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

