TG ICET-2026 Results out: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలకమైన అలర్ట్.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఐసెట్ (TG ICET-2026) ఫలితాలు అధికారికంగా విడుదల . షెడ్యూల్ ప్రకారం జూన్ చివరి వారంలో రావాల్సిన ఈ ఫలితాలను.. విద్యామండలి అధికారులు ముందస్తు ప్రణాళికతో ఐదు రోజుల ముందే (షెడ్యూల్ కన్నా ముందే) విడుదల చేస్తుండటం విశేషం.
ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షను నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) విజయవంతంగా నిర్వహించింది. గత మే 13, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ ఎగ్జామ్ జరిగింది. పరీక్ష ముగిసిన కొద్ది రోజులకే అధికారులు ప్రిలిమినరీ కీ (Preliminary Key) విడుదల చేసి, అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణుల బృందం.. నేడు తుది ఫలితాలతో పాటు ఫైనల్ కీ (Final Key) మరియు విద్యార్థుల స్టేట్ వైడ్ ర్యాంకులను కూడా ప్రకటించనుంది.
TG ICET-2026 Results: ఫలితాలను చెక్ చేసుకునే విధానం
TG ICET-2026 Results out check here
- అధికారిక వెబ్‌సైట్:https://icet.tgche.ac.in/
ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ స్టెప్స్
- మొదట పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపించే ‘TG ICET 2026 Results / Rank Card’ లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఐసెట్ హాల్‌టికెట్ నంబర్ (Hall Ticket Number), రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ (DOB) వివరాలను నమోదు చేయాలి.
- ‘Submit’ బటన్ నొక్కగానే మీ స్క్రీన్‌పై ఫలితాలు మరియు స్టేట్ ర్యాంక్ ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తు కౌన్సెలింగ్ అవసరాల కోసం దానిని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవడం మంచిది.
ఈ ఫలితాల ఆధారంగానే రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూ, మహాత్మా గాంధీ వంటి ప్రముఖ యూనివర్సిటీలతో పాటు అన్ని ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కాలేజీల్లోని ఎంబీఏ, ఎంసీఏ సీట్లను భర్తీ చేయనున్నారు. ర్యాంకుల విడుదల అనంతరం త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
'వికసిత్ భారత్' దిశగా AM/NS ఇండియా - బిట్స్ పిలానీ భాగస్వామ్యం

