Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు!

తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు!

వార్త 2 months ago

Heavy Rains in Telangana : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ వెల్లడించారు.

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆయా జిల్లాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌ లో మోస్తరు వానలు: ఉత్తరాంధ్రకూ వర్ష సూచన

రాజధాని హైదరాబాద్ లో కూడా మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉనట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం మరింత బలపడుతుండటంతో రాబోయే 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతపు ప్రభావం కారణంగా తెలంగాణతో పాటు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.

రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. IMD హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha