Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ పలు ప్రాంతాల్లో వర్షాలు..!

తెలంగాణ పలు ప్రాంతాల్లో వర్షాలు..!

వార్త 0 months ago

Rains : తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం (Rains) పట్టినప్పటికీ, తాజాగా వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో వర్షాలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా వర్ష సూచన :

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

 Rains

సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రివేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ నగరంలో పగటిపూట వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, రాత్రి లేదా అర్ధరాత్రి సమయాల్లో అక్కడక్కడ వర్షం కురిసే సూచనలున్నాయి.

ఈ వర్షాలు రైతన్నలకు ఎంతో ఊరటనిస్తాయని చెప్పవచ్చు. ఆగస్టు నెలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదుకాక కొంత లోటు ఏర్పడినప్పటికీ, రాబోయే వారం రోజుల్లో వాతావరణంలో వచ్చే మార్పులతో ఈ లోటు పూడుతుందని భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే వాతావరణ మార్పుల ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మరియు ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏఈ నూకరాజు భార్య మీనా మృతదేహం లభ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha