Telangana Jowar Procurement: తెలంగాణలోని రైతుల ప్రయోజనాలను రక్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. యాసంగి సీజన్‌లో పండించిన మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా జొన్నలు పండించిన వేలాది మంది రైతులకు మద్దతు ధర లభించనుంది.
Read Also:Telangana : తెలంగాణ లో పోటాపోటీగా రాజకీయ సభలు!
Telangana Jowar Procurement, Minister Tummala Nageswara Rao
Telangana Jowar Procurement: కేంద్రంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజం
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. Price Support Scheme (PSS) పరిధిలోకి ఈ పంటలను తీసుకుని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాసంగి సీజన్‌లో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

