Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. బియ్యం ధరలపై ప్రభుత్వం కీలక ప్రకటన!

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. బియ్యం ధరలపై ప్రభుత్వం కీలక ప్రకటన!

వార్త 3 weeks ago

Rice Prices: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

బీపీటీ బియ్యం కిలో రూ. 66గా నిర్ణయం

సాధారణ ప్రజలు ఎక్కువగా వినియోగించే నాణ్యమైన బీపీటీ రకం బియ్యం ధరను ప్రభుత్వం నియంత్రించింది. మార్కెట్లో విక్రయించే బీపీటీ బియ్యం గరిష్ట ధరను (Maximum Retail Price) కిలోకు రూ. 66 మించకుండా నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వ్యాపారులు ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

Rice Prices: కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

బియ్యం అక్రమ నిల్వలు (Hoarding) చేస్తూ మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. నిబంధనలను అతిక్రమించి అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12 కేసులు నమోదు చేసినట్లు మంత్రి హెచ్చరించారు. అక్రమార్కులపై రానున్న రోజుల్లో మరింత కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి అభయం

మార్కెట్‌లో ప్రస్తుతం సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త చర్యల వల్ల బహిరంగ మార్కెట్లో ధరలు అదుపులోకి వచ్చి, సామాన్యులకు ఎంతో ఊరట లభించనుంది.

Epaper: epaper.vaartha.com

సింగరేణి ఉద్యోగులకు దీపావళి కానుక.. నవంబర్ 5న రూ.419 కోట్ల బోనస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha