Telangana Cabinet Decisions : సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధానంగా చర్చించారు.
Read Also: Breaking News : "నాకు భయం లేదు": దాడి తర్వాత సుఖ్‌బీర్ బాదల్ స్పందన
Telangana Cabinet Decisions
Telangana Cabinet Decisions : కేబినెట్ ముఖ్య నిర్ణయాలు
ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ఘనంగా “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0” నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈసారి సదస్సును ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ (Invest Telangana) అనే ప్రత్యేక థీమ్‌తో రూపకల్పన చేస్తున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ తదితర రంగాలు సాధించిన పురోగతిని, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా సదస్సును నిర్వహించనున్నారు. నూతన ఆవిష్కరణలు, పరిశ్రమల విజయాలు, స్టార్టప్ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. సమిట్ నిర్వహణ వేగవంతంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది.
మీ ఇంటిపై జెండా ఎగురవేస్తున్నారా? ఈ ఫ్లాగ్ కోడ్ రూల్స్ తప్పక పాటించండి!

