Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..మీ స్కోర్‌కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..మీ స్కోర్‌కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

వార్త 3 weeks ago

TG TET Results 2026: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. జూన్ సెషన్‌కు సంబంధించిన 'టీజీ టెట్' ఫలితాలను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నేడు, జులై 13న అధికారికంగా విడుదల చేసింది.

ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అధికారిక ఫలితాలతో పాటు స్కోర్‌కార్డులను కూడా బోర్డు వెబ్‌సైట్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : నేడే తెలంగాణ టెట్ ఫలితాలు.. అధికారిక లింక్ ఇదే!

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

తెలంగాణవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల పోటీకి అత్యంత కీలకమైన ఈ టీజీ టెట్ జూన్ 2026 పరీక్షలను విద్యాశాఖ విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలను జూన్ 16 నుండి జూన్ 22, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో (Computer-Based Test) నిర్వహించారు. పరీక్ష ముగిసిన కొద్ది రోజుల్లోనే వేగంగా స్పందించిన అధికారులు నేడు (జులై 13, 2026) ఫలితాలను అధికారికంగా లైవ్‌లోకి తీసుకొచ్చారు.

TG TET Results : టీజీ టెట్ ఫలితాలు ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం ఎలా?

అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రింది సులభమైన స్టెప్స్ ఫాలో అయి తమ స్కోర్‌కార్డును పొందవచ్చు:

  • స్టెప్ 1: మొదటగా తెలంగాణ టెట్ అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in ను సందర్శించండి.
  • స్టెప్ 2: హోమ్‌పేజీలో కనిపిస్తున్న ‘TG TET June 2026 Result’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: ఓపెన్ అయిన కొత్త విండోలో అభ్యర్థి తన హాల్ టికెట్ నంబర్ (Hall Ticket Number) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • స్టెప్ 4: మీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అయ్యే ఫలితాల మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ కాపీని భద్రపరుచుకోండి.

రేపే టెట్ ఫలితాల విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha