Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ టాలెంట్ హంట్.. సరికొత్త కార్యక్రమం ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ టాలెంట్ హంట్.. సరికొత్త కార్యక్రమం ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్

వార్త 1 week ago

Talent Hunt: రాజకీయాల్లోకి సమర్థులైన, విద్యావంతులైన యువతను ప్రోత్సహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం గాంధీ భవన్‌లో పార్టీ తరఫున వినూత్నమైన 'టాలెంట్ హంట్' (Talent Hunt) కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ప్రజా సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న ప్రతిభావంతులైన యువతీ యువకులకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం ద్వారా ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం పెరగాలనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాల నుంచే ఈ వినూత్న ఆలోచన పుట్టిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

 Congress Official Spokesperson Selection

Read also: TGPSC: టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే!

ఇది కేవలం పార్టీ చేరిక కాదు.. ప్రతిభకు పట్టం కట్టే ప్రక్రియ!

ఈ కార్యక్రమం ఇతర పార్టీల లాగా సాధారణ రాజకీయ చేరికల కోసమే ఉద్దేశించినది కాదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలనే తపన ఉన్న ఎవరికైనా, వారి కుటుంబ లేదా రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా ఈ వేదిక స్వాగతం పలుకుతుందన్నారు. ఈ టాలెంట్ హంట్ ద్వారా పార్టీ అధికారిక ప్రతినిధులను (Official Spokespersons) పూర్తిగా పారదర్శకమైన పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాలపై బలమైన పట్టు, లౌకికవాద సిద్ధాంతాలపై నిబద్ధత, సామాజిక స్పృహతో పాటు ప్రజల్లోకి తమ భావాలను సమర్థవంతంగా తీసుకెళ్లగలిగే వక్తృత్వ నైపుణ్యం ఉన్నవారిని ఈ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.

Talent Hunt: వారసత్వ రాజకీయాలకు చెక్.. యువ రక్తాన్ని ఆహ్వానిస్తున్న కాంగ్రెస్

ఎటువంటి పొలిటికల్ గాడ్‌ఫాదర్స్ లేకపోయినా.. కేవలం సొంత ప్రతిభ, సమాజంపై స్పష్టమైన విజన్, సేవా దృక్పథం ఉన్న నిఖార్సైన వ్యక్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిస్తోందని టీపీసీసీ చీఫ్ తెలిపారు. సాంప్రదాయ వారసత్వ రాజకీయాలకు భిన్నంగా, క్షేత్రస్థాయి నుంచి నూతన ఉత్సాహవంతులైన నాయకులను పార్టీలోకి ఆహ్వానించడానికి కాంగ్రెస్ వేసిన ఈ అడుగు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు 3 కొత్త నోటిఫికేషన్లు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha