Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్

వార్త 2 weeks ago

Auto Charges Hike: తెలంగాణ రాష్ట్రంలో ఆటోరిక్షా ప్రయాణం మరింత ప్రియం కానుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆటో మీటర్ ఛార్జీల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూల నిర్ణయం తీసుకుంది.

ఆటో సంఘాల నుంచి వస్తున్న నిరంతర విజ్ఞప్తులను పరిశీలించిన సర్కార్, కొత్త ధరలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

కమిటీ సిఫారసులు మరియు కొత్త రేట్లు

గత కొద్దికాలంగా పెరుగుతున్న నిత్యావసరాలు, విడిభాగాల ధరలు మరియు ఇంధన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ఆటో ఛార్జీల పునఃసమీక్ష కమిటీ ఒక కీలక నివేదికను రూపొందించింది. ఈ సిఫారసుల ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.20 కనీస ఛార్జీని ఏకంగా రూ.30కి పెంచాలని ప్రతిపాదించారు. అలాగే, అదనపు కిలోమీటరుకు వసూలు చేసే ఛార్జీని రూ.11 నుంచి రూ.14కి సవరించాలని సూచించారు.

Auto Charges Hike: రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన

ఈ కమిటీ అందించిన నివేదికపై రవాణా శాఖ మరియు ప్రభుత్వ అధికారులు సమగ్రంగా చర్చించారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో కొత్త ఛార్జీల జాబితాను ప్రకటించి, వెంటనే వాటిని రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు.

2014 నాటి పాత ఛార్జీలకు స్వస్తి

రాష్ట్రంలో దాదాపు 2014 సంవత్సరం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా అవే పాత మీటర్ ఛార్జీలు కొనసాగుతూ వస్తున్నాయి. కాలం మారుతున్న కొద్దీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాలను గుర్తించి, దశాబ్ద కాలం తర్వాత ఛార్జీలను సవరించాలని ఆటో డ్రైవర్ల సంఘాలు చేసిన డిమాండ్లకు ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

రేషన్ కార్డుదారులకు అలర్ట్.. నేటితో ముగియనున్న బియ్యం పంపిణీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha