LPG Cylinder e-KYC Deadline : తెలంగాణలో ఎల్పీజీ (LPG) వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చమురు సంస్థలు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఇచ్చినప్పటికీ, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు వారం రోజుల ముందే అనధికారికంగా సరఫరాను ఆపేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి చేయడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ఇంధన కంపెనీలు రంగంలోకి దిగి చర్యలు వేగవంతం చేశాయి. అన్ని రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా బోగస్ ఎల్బీజీ కనెక్షన్లు, అనర్హుల పేరిట ఉన్న కనెక్షన్లు, ఒకే కుటుంబంలో రెండు, మూడు కనెక్షన్లు ఉండటంతో అందుకు ఇచ్చే రాయితీ భారం కేంద్రంపై పడుతోంది.
Read Also: Jan Vishwas Act 2026: డ్రైవింగ్ లైసెన్స్ ఆలస్యం ఇకపై నేరం కాదు
LPG Cylinder e-KYC Deadline
LPG Cylinder e-KYC Deadline : సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ..
ఆన్‌లైన్‌లో బుకింగ్ పూర్తయి, డెలివరీ అయ్యే సమయంలో ఈ-కేవైసీ లేని కనెక్షన్లకు సిలిండర్లను అందించకుండా ఆపేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు దాదాపు 30,000 సిలిండర్ల సరఫరా నిలిచిపోతోంది. తెలంగాణలోని 1.3 కోట్ల డొమెస్టిక్ కనెక్షన్లలో ఇంకా సుమారు 26 లక్షల (20% పైగా) కనెక్షన్లకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఒకే కుటుంబంలో రెండు కనెక్షన్లు ఉండటం, నకిలీ పేర్లతో ఉన్న కనెక్షన్లను తొలగించి సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా IOCL, BPCL, HPCL సంస్థలు ఈ-కేవైసీపై దృష్టి సారించాయి. ఇంటి వద్దకే వచ్చి డెలివరీ సిబ్బంది ఈ-కేవైసీ చేయాల్సి ఉన్నా, అది సరిగా అమలు కాకపోవడంతో వినియోగదారులు 30-40 కి.మీ దూరంలో ఉన్న ఏజెన్సీ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. మొబైల్ యాప్‌ల ద్వారా ప్రయత్నించినా ఓటీపీల జాప్యం, సర్వర్ ఫెయిల్యూర్, బయోమెట్రిక్ సమస్యలతో ఆన్‌లైన్ ప్రక్రియ విఫలమవుతోంది. గడువు ఆగస్టు 16 వరకు ఉన్నప్పటికీ, ఆగస్టు 1 నుంచే ఆన్‌లైన్ బుకింగ్స్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
Epaper: epaper.vaartha.com

