Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు: 2.5 లక్షల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు: 2.5 లక్షల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్!

వార్త 18 hrs ago

TG Indiramma houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద అర్హులైన పేదలకు సొంత ఇళ్లు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని తీర్మానించారు.

జూన్ 1 నుంచి ఈ ప్రక్రియను పారదర్శకంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో నిలువ నీడ లేని పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

Read also: Sunburn Dies : తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే వడదెబ్బ కు 56 మంది మృతి

 Distribution of Indiramma Houses in Telangana

సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం, నిబంధనలు

సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో మంజూరై అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. పునాదులు పూర్తయి శ్లాబు వేయని ఇళ్లకు రూ. 3 లక్షలు, గోడలు కట్టి శ్లాబు వేయాల్సిన ఇళ్లకు రూ. 2 లక్షల చొప్పున నిధులు విడుదల చేయనున్నారు. ఇళ్లు లేని పేదలను గుర్తించేందుకు నిర్వహించిన సర్వే ప్రకారం సుమారు 15 వేల కుటుంబాలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నాయని తేలింది, వారికి ప్రాధాన్యత క్రమంలో ఇళ్లు కేటాయిస్తారు.

TG Indiramma houses: ఇతర కీలక అభివృద్ధి నిర్ణయాలు, గడువు

హైదరాబాద్ నగరంలోని 24 నియోజకవర్గాల పరిధిలో పేదల కోసం లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి మొదటి విడతలో మంజూరైన లక్ష ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవే కాకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ. 587 కోట్లు కేటాయింపు, వచ్చే నాలుగేళ్లకు సంబంధించి లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30కి ఆమోదం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిద్ధమైన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ప్రారంభించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha