Dailyhunt
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

వార్త 1 week ago

Suryapet RTC Strike: తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న వేళ, సూర్యాపేట బస్ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిపో నుంచి బస్సులను బయటకు పంపే క్రమంలో పోలీసులకు, సమ్మె చేస్తున్న కార్మికులకు మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి రణరంగంగా మారింది.

Read Also: Kaleshwaram project verdict : కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

 Suryapet RTC Strike: RTC strike continues in Telangana

బస్సుల అడ్డగింత.. పెరిగిన ఘర్షణ

ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నప్పటికీ, అధికారులు పోలీసు పహారా మధ్య డిపో నుంచి బస్సులను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు పెద్ద సంఖ్యలో డిపో గేటు వద్దకు చేరుకుని అడ్డుకున్నారు. “సమ్మె జరుగుతుంటే బస్సులను ఎలా బయటకు తీసుకెళ్తారు?” అంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

Suryapet RTC Strike: పోలీసుల మోహరింపు

పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు డిపో పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. నిరసన తెలుపుతున్న పలువురు కార్మికులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని, ప్రభుత్వం తమపై పోలీసులతో దాడి చేయించడం దారుణమని కార్మికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట డిపో వద్ద ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఆర్టీసీ సమ్మె ఉధృతం: నేడు 'మహా ధర్నా'.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha