May Remove 40 Lakhs Votes In Telangana : తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను సేకరించడానికి వీలు లేనివిగా (అన్‌కలెక్టబుల్) నిర్ధారిస్తూ, వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
Read Also: Telangana driving license: తెలంగాణలో కొత్త డ్రైవింగ్ రూల్స్
May Remove 40 Lakhs Votes In Telangana
అన్‌కలెక్టబుల్ పేరుతో ఓట్ల తొలగింపు?
ఎలక్షన్ కమిషన్ అధికారులు నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా 100 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశామని అధికారులు చెప్తున్నారు. అయితే అందులో కొన్ని పత్రాలు తిరిగి లభించకపోవడంతో వాటిని ‘అన్‌కలెక్టబుల్’ కింద పరిగణిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియకు ఇంకా గడువు ఉన్నప్పటికీ, అధికారులు ముందస్తుగా అన్‌కలెక్టబుల్ పేరుతో ఓట్లను ఎలా తొలగిస్తారని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు దాదాపు 76.72 శాతం (2,59,50,506) డిజిటలైజేషన్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఆబ్సెంట్ (అందుబాటులో లేనివారు), షిఫ్టెడ్ (చిరునామా మారినవారు), డెడ్ (మరణించినవారు) - ఈ ASD (Absent, Shifted, Dead) కేటగిరీ కింద తొలగించే ఓట్ల సంఖ్య ఒక్కసారిగా పెరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు వారాల క్రితం ఈసీ డ్యాష్‌బోర్డ్‌లో ASD కింద 13 లక్షల ఓట్లు మాత్రమే నమోదు కాగా, కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సంఖ్య 40 లక్షలకు చేరుకోవడం గమనార్హం.
May Remove 40 Lakhs Votes In Telangana : పట్టణ నియోజకవర్గాల్లోనే అధికం!
పలు కీలక నియోజకవర్గాల్లో ఏకంగా 20% నుండి 28% వరకు ఓట్లు అన్‌కలెక్టబుల్ జాబితాలోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.ఉప్పల్: అత్యధికంగా 28% ఓట్లువెస్ట్ వరంగల్: 26% ఓట్లుసికింద్రాబాద్: 24% ఓట్లుమంచిర్యాల: 23% ఓట్లుసికింద్రాబాద్ కంటోన్మెంట్: 22% ఓట్లుకుత్బుల్లాపూర్: 21% ఓట్లు కరీంనగర్: 20% ఓట్లు. చాలామంది ఓటర్లకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని, అలాంటి వాటిని కూడా అధికారులు అన్‌కలెక్టబుల్ కింద నమోదు చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. సమగ్ర విచారణ లేకుండా ASD జాబితా ఆధారంగా ఓట్లను తీసివేయాలంటే బూత్ లెవెల్ ఏజెంట్ (BLA) సంతకం తప్పనిసరి. అయితే, సరైన అవగాహన లేని BLAలపై అధికారులు ఒత్తిడి తెచ్చి ఓటర్లు ఆ చిరునామాలో లేరంటూ బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

