Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

వార్త 2 weeks ago

Telangana weather Report : రాష్ట్రంలో నేడు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఈ జిల్లాల్లో వర్షసూచన : ఉపరితల ఆవర్తనంతో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

Read Also: Telangana TET: సెప్టెంబర్ లో తెలంగాణ టెట్ ఆన్లైన్ పరీక్షలు

 Telangana weather Report

Telangana weather Report : పలుచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు

మరోవైపు రాష్ట్రంలో గడిచిన రెండు రోజుల్లో అంటే ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలుచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు)లో 10.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరు 8.2, నిజామాబాద్‌ గ్రామీణ మండలం మల్కాపూర్‌ 8.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మెదక్​ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మెదక్​లో 4.8, సిద్దిపేటలోని కుకునూర్​పల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 4.3 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

ఈ నెల 22న బీటెక్ సీట్లు కేటాయింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha