Telangana Weather: తెలంగాణలో భానుడి భగభగలకు విరామం ఇస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా 44-45 డిగ్రీల ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు అకాల వర్షాలు ఉపశమనాన్ని కలిగించాయి.
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు వడగళ్లు కురిసాయి. అయితే, ఉరుములు, మెరుపులతో పాటు కురిసిన భారీ వడగళ్ల వాన పలు జిల్లాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Also:Rathod Bapurao: తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

