Pawan Kalyan: తెలంగాణను ఇబ్బందుల్లోకి నెట్టే లేదా అస్థిరపరిచే ఎలాంటి రాజకీయాలకూ తాను ఎన్నడూ మద్దతు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర గౌరవం, శాంతియుత వాతావరణం, సహకారంతో ముందుకు సాగుతూ ప్రయోజనాలను కాపాడుకోవాలనేదే తన ఆకాంక్ష అని ఆయన తేల్చిచెప్పారు.
PawanKalyanXPost
Read also: Kothagudem Politics : కొత్తగూడెం లో హాట్ హాట్ గా మారిన పాలిటిక్స్..!
‘ఎక్స్’ వేదికగా పాత వీడియోతో వివరణ
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీయడంతో పవన్ కల్యాణ్ స్పందించారు. గురువారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేసిన ఆయన.. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, ఆకాంక్షల పట్ల రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటివరకు తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో హైదరాబాద్‌లో ఉమ్మడి గవర్నర్ పాలనకు వీలు కల్పించే ‘సెక్షన్ 8’ అమలును తాను తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ చట్టం తెలంగాణ ప్రజల స్వయంపాలనా హక్కును, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసేలా ఉందనే ఉద్దేశంతోనే ఆనాడు వ్యతిరేకించానని చెప్పారు. రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం కేవలం నమ్మకమైన యంత్రాంగాలు ఉంటే సరిపోతుందని నాడు తాను అన్న మాటలకు సంబంధించిన పాత వీడియో క్లిప్‌ను కూడా ఈ పోస్టుకు జతచేశారు.
Pawan Kalyan: వివాదానికి దారితీసిన గచ్చిబౌలి సభ పరిణామాలు
ఇంతకుముందు జూన్ 2న గచ్చిబౌలిలో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, పవన్ కల్యాణ్ తన నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన వ్యూహాత్మకంగా బరిలోకి దిగుతుందని ప్రకటించారు. అయితే, ఇదే సమావేశంలో 'అతివాద ప్రాంతీయత' (Extreme Regionalism) గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీశాయి.
తెలంగాణ కాంగ్రెస్ నేతల కౌంటర్.. పవన్ రియాక్షన్
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు నాయకులు స్పందిస్తూ.. అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సిద్ధించిన తెలంగాణ అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యం అవసరం లేదంటూ హితవు పలికారు. ఈ వ్యతిరేకత మరియు రాజకీయ దుమారం నేపథ్యంలోనే, తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ పవన్ కల్యాణ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

