Telangana: అడోబ్ (Adobe) సీఈవో, 'తెలంగాణ రైజింగ్-2047' విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) భేటీ అయ్యారు.
రాష్ట్ర భవిష్యత్తు, పారిశ్రామికాభివృద్ధి మరియు సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ రంగంపై చూపుతున్న ప్రభావం గురించి శంతను నారాయణ్ మరియు ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. తెలంగాణను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా (Manufacturing Hub) మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్లోబల్ ట్రెండ్స్, గ్రీన్ ఎనర్జీ ,కొత్త పారిశ్రామిక అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్‌ను పంచుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

